పుల్కల్,సెప్టెంబర్ 6 : సంగారెడ్డి జిల్లా బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వారం రోజుల నుంచి కొనసాగిన వరద కాస్త తగ్గు ముఖం పట్టింది. గురువారం ప్రాజెక్టు 4,6వ క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు వరద తగ్గడంతో శుక్రవారం సాయంత్రం 4వ గేటు మూసివేశారు.6వ గేటును 1.50 మీటర్ల ఎత్తు లేపి 8142 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
కాగా సింగూరు ప్రాజెక్టు వరద నీటితో నిండుకుండలా మారింది. ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పుడు నీటి హెచ్చుతగ్గులను గమనిస్తూ ప్రాజెక్టు వద్దే ఉం టున్నారు. సందర్శకులను ప్రాజెక్టుపైకి అనుమతించడం లేదు.ప్రాజెక్టు వద్ద చేపలఫ్రై ఫేమస్ కావడం తో పర్యాటకులు వాటినే ఇష్టంగా తింటారు. ప్రాజె క్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 28.776 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి వస్తున్న వరద 11501 క్యూసెక్కులు కాగా క్రస్ట్ గేటు ద్వారా 8142 క్యూసెక్కులు, అం దులో విద్యుత్ ఉత్పత్తి కోసం 2803 క్యూసెక్కులు, మొత్తంగా అవుట్ ఫ్లో 10945 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నట్లు ప్రాజెక్టు ఏఈ మహిపాల్‌రెడ్డి తెలిపారు.