పాపన్నపేట, ఆగస్టు 20: మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం వారం రోజులుగా జల దిగ్బంధంలోనే చిక్కుకుంది. ఆలయం ఎదుట మంజీరా నదిలో వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. సోమవారం 69వేల క్యూసెక్కుల నీరు ఘనపూర్ ఆనకట్ట నుంచి ఆలయం దిగువకు వెళ్లింది.
మంగళవారం 55వేల క్యూసెక్కుల నీరు ఘనపూర్ ఆనకట్ట నుంచి దిగువకు ప్రవహించగా, బుధవారం 50వేల క్యూసెక్కులు దిగువకు పరవళ్లు తీసింది. అర్చకులు రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు. ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు.