నాగల్గిద్ద, జనవరి 4: సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం గౌడ్గాం జన్వాడ గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో శనివారం ఇద్దరు విద్యార్థులు మాత్రమే పాఠశాలకు హాజరయ్యారు. వీరికి జయమణి అనే ఉపాధ్యాయురాలు పాఠాలు బోధించారు.
ఇక్కడ హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న అప్పారావు డిప్యుటేషన్‌పై కారాముంగి జిల్లా పరిషత్ పాఠశాలకు వెళ్లినట్లు తెలిసింది. ప్రస్తుతం గౌడ్గాం జన్వాడ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు కూడా పాఠశాలకు సరిగ్గా హాజరు కావడం లేదని తెలిసింది.
ఇద్దరు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెట్టడం లేదు. దీంతో ఇంటి నుంచి టిఫిన్ తెచ్చుకుంటున్నారు. మండలంలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజనం అమలుతో పాటు విద్యార్థులు సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.