Dog Attack | పిచ్చికుక్క దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలు.. హైదరాబాద్కు తరలింపు
Dog Attack | సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని తుమ్మన్పల్లి గ్రామంలో ఆదివారం ఒక పిచ్చికుక్క తీవ్ర అలజడి సృష్టించింది.
ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని తుమ్మన్పల్లి ( Tummanpalli ) గ్రామంలో ఆదివారం ఒక పిచ్చికుక్క ( Dog Attack ) తీవ్ర అలజడి సృష్టించింది. గ్రామంలోని జనావాసాల్లోకి చొరబడి ఒక్కసారిగా ప్రజలపై విరుచుకుపడింది. ఈ దాడిలో గ్రామానికి చెందిన రిజ్వానా బేగం, చంటయ్య, యేసయ్య, విష్ణువర్ధన్రెడ్డి సహా మొత్తం ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు ( Injures) .
బాధితుల ముక్కు, నోరు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఝరాసంగం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వారిని జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అనంతరం అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం బాధితులను హైదరాబాద్కు తరలించారు.
అంతకుముందు శనివారం బొజ్జానాయక్ తండాకు చెందిన విశాల్ అనే యువకుడిపై ఇదే కుక్క దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు.మండలంలో పిచ్చికుక్కల దాడులు నిత్యకృత్యంగా మారాయని స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ బర్దిపూర్, ఝరాసంగం, బొజ్జానాయక్ తండా, కుప్పానగర్ తదితర గ్రామాల్లో కుక్కలు దాడులు చేసి పలువురిని గాయపరిచిన సంబంధిత అధికారులు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

