జిన్నారం, జనవరి 7 : పటాన్చెరు నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని జంగంపేట గ్రామంలో నిర్వహించిన రేణుకా ఎల్లమ్మతల్లి ఆలయ ప్రథమ వార్సికోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆలయా ల నిర్మాణానికి తనవంతు సహకారం అందించినట్లు చెప్పారు. అనంతరం సర్పంచ్ వెంకటయ్య, ఉప సర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి, వార్డు సభ్యులు ఎమ్మెల్యేను శాలువాలతో సన్మానించారు. ఎమ్మెల్యే వెంట జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వెంకటేశంగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, ఊట్ల సర్పంచ్ ఆంజనేయులు, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, సార నరేందర్, గాండ్ల శ్రీనివాస్, బండి శ్రీకాంత్‌గౌడ్, భిక్షపతి, మహేశ్ ఉన్నారు.
రామచంద్రాపురం, జనవరి 7 : జాతరలు మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్సీపురం డివిజన్లోని శ్రీనివాస్‌నగర్‌కాలనీలో ఉన్న సోమేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న మహోత్సవంలో డివిజన్ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పానగేశ్‌తో కలిసి హాజరయ్యారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లాపూర్ గ్రామంలో జరుగుతున్న భ్రమరాంబిక మల్లికార్జునస్వామి జాతరలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలను స్వామివారు సుఖసంతోషాలతో చూడాలని కోరుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఆయా ఆలయాల్లో ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే, ప్రముఖులను సన్మానించారు. కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్, ఏఎంసీ చైర్మన్ మల్లారెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజయ్య, ఏఎంసీ డైరెక్టర్ ఐలేశ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు రమేశ్‌యాదవ్, సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్, కౌన్సిలర్ శ్రీశైలం, మున్సిపాల్ అధ్యక్షుడు దేవేందర్‌యాదవ్, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, మోహన్‌రెడ్డి, ప్రభాకర్‌యాదవ్, నర్సింహులు పాల్గొన్నారు.
హత్నూర, జనవరి 7 : హత్నూర శివారులోని మల్లన్నగుట్టల్లో వెలసిన భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం భ్రమరాంబ మల్లికార్జునస్వామి కల్యాణ మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం షెడ్డు, రోడ్డు నిర్మాణం చేపట్టాలని కురుమ సంఘం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కోరారు. ఆమె వెంట గ్రామస్తు లు కిష్టయ్య, ఆశయ్య, మధుసూదన్‌గౌడ్, నరేందర్, చెన్నారెడ్డి, భిక్షపతి, నర్సింహులు, రాజు, సురేశ్, కృష్ణ, శ్రీశైలం ఉన్నారు.