జిన్నారం, మే 6: సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామికవాడలోని మైలాన్ పరిశ్రమ ఆర్అండ్డీ సెంటర్లో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అగ్ని ప్రమాదాన్ని గుర్తించి యాజమాన్యానికి సమాచారం అందించారు. నాలుగో అంతస్తులో షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.
తెల్లవారుజామున సంఘటన జరగడంతో ఆసమయంలో కార్మికులు, సిబ్బంది లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ఘటనా స్థలాన్ని సీఐ రవీందర్ రెడ్డి సందర్శించారు. అగ్నిప్రమాదంలో ల్యాబ్‌లోని పలు పరికరాలు కాలి బూడిదయ్యాయి. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో బొల్లారం పారిశ్రామికవాడ ఒకసారిగా ఉలికిపడింది.