భారీ అగ్నిప్రమాదం
రసాయన పరిశ్రమలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో కార్మికులు పరుగులు తీశారు. పోలీసులు, కార్మికు లు, పరిశ్రమ యజమానుల వివరాల ప్రకా రం.. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామికవాడలోని న్యూట్రల్ కెమికల్స్ ఇండస్ట్రిస్లో రోజూ యాభైమంది వరకు కార్మికులు విధులు నిర్వహిస్తుంటారు.
- రసాయన పరిశ్రమలో సుమారు రూ.3కోట్ల వరకు ఆస్తినష్టం
- మంటలు ఆర్పేందుకు ఐదు గంటలు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది
జిన్నారం, ఏప్రిల్ 10 : రసాయన పరిశ్రమలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో కార్మికులు పరుగులు తీశారు. పోలీసులు, కార్మికు లు, పరిశ్రమ యజమానుల వివరాల ప్రకా రం.. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామికవాడలోని న్యూట్రల్ కెమికల్స్ ఇండస్ట్రిస్లో రోజూ యాభైమంది వరకు కార్మికులు విధులు నిర్వహిస్తుంటారు.
శుక్రవారం మధ్యాహ్నం ఎప్పటిలాగే కార్మికులు విధుల్లో ఉండగా మం టలు ఎగిసిపడ్డాయి. దీంతో కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో కార్మికులకు ఎలాంటి ప్రాణహానీ జరగలేదు. మం టలు భారీగా ఎగిసి పడటంతో సమీపంలోని పరిశ్రమల యజమానులు అప్రమత్తమయ్యా రు. మంటలను ఆర్పేందుకు జీడిమెట్ల, పటాన్చెరు, నర్సాపూర్ ప్రాంతాల నుంచి ఫైర్ ఇం జన్లు వచ్చాయి.
మంటలను ఆర్పేందుకు ఐదుగంటల పాటు ఫైర్ సిబ్బంది శ్రమించారు. సమీపంలోని ఆర్డీపీఎల్, సరాకా, హెటిరో తదితర పరిశ్రమల ప్రతినిధులు మంటలను ఆర్పేందుకు ఫోమ్ అందజేశారు. అగ్నిమాపక సిబ్బం ది మంటలను అదుపులోకి తీసుకురావటంతో సమీపంలోని రసాయన పరిశ్రమ యాజమాన్యాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఘటనా స్థలా న్ని జిన్నారం తహసీల్దార్ దేవదాసు, బొల్లారం సీఐ రవీందర్‌రెడ్డి సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును సంబంధిత యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై సీఐ రవీందర్‌రెడ్డిని వివరణ కోరగా ప్రమాదంలో ప్రాణహానీ జరగలేదన్నారు. ఫైర్‌ఇంజన్ల ద్వారా మంటలను సకాలంలో అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
పరిశ్రమ ఎండీ మల్లిఖార్జున్రెడ్డిని మాట్లాడుతూ రసాయనాలు కలిపే క్రమంలో ఉష్ణోగ్రత ఎక్కువై మంటలు చెలరేగాయన్నారు. సుమారు రూ.3కోట్ల వరకు ఆస్తినష్టం జరిగిందన్నారు. పరిశ్రమ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

