నర్సాపూర్ : విందు భోజనం వికటించి ( Meal consume ) 41 మందికి అస్వస్థతయిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. నర్సాపూర్( Narsapur ) లో శుక్రవారం సాయంత్రం హవేజ్ అనే వ్యక్తి కుటుంబానికి చెందిన హల్ది ఫంక్షన్ నిర్వహించారు. కార్యక్రమానికి అవేజ్కి చెందిన బంధుమిత్రులు, కుటుంబీకులు 70 మంది
పాల్గొని ఉత్సాహంగా గడిపారు.
అనంతరం ఏర్పాటు చేసిన విందులో అందరూ కలిసి భోజనం చేశారు. అనంతరం అందులో 41 మంది వాంతులు విరోచనాలు చేసుకోవడంతో వారిని నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. అందులో ముగ్గురు చిన్నారులు ఉండడంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఇద్దరిని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు.
నర్సాపూర్ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ పావని మాట్లాడుతూ అర్ధరాత్రి 12 తర్వాత వరుస పెట్టి వాంతులు విరోచనాలతో ఆస్పత్రికి రాగా కొంతమందికి చికిత్స నిర్వహించి పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఇంటికి పంపించినట్లు తెలిపారు. మిగిలిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫంక్షన్ జరిగిన ప్రాంతానికి ఫుడ్ ఇన్స్పెక్టర్ వెళ్లి ఫుడ్ శాంపిల్ సైతం సేకరించినట్లు తెలిపారు.