రాయపోల్ : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి ( Vaddepalli ) గ్రామంలో చిరుత ( Leopard ) కలకలం సృష్టించింది. వడ్డేపల్లి గ్రామానికి చెందిన వేముల రాజ మల్లయ్య పొలం వద్ద కోతుల కోసం రక్షణగా కుక్కలను కట్టివేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం పొలం వద్దకు వెళ్లి పరిశీలించగా రెండు కుక్కలను చిరుత పులి చంపివేసి తిన్నది. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులను సమాచారం అందించడంతో ఫారెస్ట్ రేంజ్ అధికారి ( FRO) సందీప్ కుమార్ సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. చిరుత పాదముద్రలను పరిశీలించారు. చిరుత సంచరిస్తున్నందున చుట్టుపక్కల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.