కొల్చారం, ఏప్రిల్ 28: మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని వసురామ్తండాలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు.తేమపేరుతో అడుగడుగునా దోపిడీ చేస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం 17శాతం తేమ ఉన్నా ధాన్యం కొనుగోలు చేయాలని బ్యానర్లు ప్రదర్శిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా ఉంది. వసురాం తండాలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తేమశాతం 10 లేదా 11 ఉంటేనే కొనుగోలు చేస్తామని చెబుతున్నారని రైతులు బోరుమంటున్నారు. వ్యవసాయాధికారి కూడా తేమశాతం 11 ఉంటేనే కొనుగోలు చేస్తామని రైతులతో చెప్పడం గమనార్హం. తేమ శాతం పూర్తిగా తగ్గడంతో వడ్లు తేలికై ఎక్కువగా తూకం అవుతున్నాయని రైతులు వాపోతున్నారు.
ధాన్యం బాగా ఎండబెట్టిన తర్వాతనే తీసుకుంటామం టున్నారు. తేమ శాతం 10 లేదా 11 ఉండాలంటున్నారు. 300 బస్తాలు అయ్యే వడ్లు తక్కువ అవుతున్నాయి. ఎండిఎండి కల్లంలనే బియ్యం అయితున్నాయి. కాంటా వేసిన వడ్లు బస్తాలో పట్టక కిందతోడేస్తున్నారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. బస్తాలు కూడా ఇవ్వడం లేదు. ఒక్కో బస్తా రూ.15 ఖర్చుచేసి కొనుగోలు చేస్తే ధాన్యం తూకం వేస్తున్నారు.
– లున్సావత్ కిషన్, రైతు, వసురాంతండా, కొల్చారం, మెదక్ జిల్లా