మహాధర్నాలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, చిత్రంలో మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి
మెదక్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఇది అంతం కాదు.. ఆరంభం మాత్రమే.. మోదీ ప్రభుత్వం మీద గళమెత్తినం.. 2001లో సీఎం కేసీఆర్ తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో 14 సంవత్సరాల పాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ జెండా పట్టినప్పుడే స్వరాష్ట్రం రావాలనే విజన్‌తో సీఎం కేసీఆర్ అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందనన్నారు.
29వ రాష్ట్రంగా అవతరించిన దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. పక రాష్ర్టాల సీఎంలు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను వారి రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారని పేరొన్నారు. ఇక్కడ పండించిన యాసంగి పంట కొనలేదని, హర్యానా, పంజాబ్ రాష్ర్టాలను ఒకరకంగా, తెలంగాణను మరొక రకంగా చూస్తున్నారని ప్రధానమంత్రి మోదీపై నిప్పులు చెరిగారు. రైతులు అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ చూస్తుంటే.. బీజేపీ ప్రభుత్వం మాత్రం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని దుయ్యబట్టారు. తెలంగాణలో ఉపాధి హామీ పనులను అనుసంధానం చేయాలని సీఎం కేసీఆర్ అనేక విజ్ఞప్తులు చేసినా, రైతులను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. సింగూరు నీళ్లను మెదక్ జిల్లాకే కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. రైతు చనిపోతే రైతుబీమా పథకం కింద రూ.5 లక్షలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేరొన్నారు. రైతుల ధాన్యాన్ని కొనకుండా ఇబ్బందిపెడుతున్న మోదీ సరార్కు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. బీజేపీ నేతలు రాష్ట్రంలో ఒక మాట, దేశంలో మరో మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో మోదీ సర్కార్ ఒక పథకాన్నైనా ప్రవేశపెట్టారా.. ? అని ప్రశ్నించారు. మతోన్మాదంతో ప్రజలను రెచ్చగొట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని అన్నారు. కరోనా కష్టకాలంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నది తెలంగాణ సరార్ అని అన్నారు. రైతుల గోస మోదీ ప్రభుత్వానికి తెలవదని, అందుకే సీఎం కేసీఆర్‌కు వీర తిలకం దిద్ది ముందుకు పంపుతున్నామని గుర్తు చేశారు. బీజేపీని గద్దెదించే వరకు పెద్దఎత్తున పోరాటం చేస్తామని అన్నారు.
కార్పొరేటర్లకు కొమ్ము కాస్తున్న మోదీ సర్కార్
– శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ వారికి లబ్ధి చేకూరుస్తున్నదని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నదని పేర్కొన్నారు. గతంలో పిచ్చి మొకలు తొలగించడం, తీసిన పూడికనే మళ్లీ తీయడం వంటి అనుత్పాదక పనులు చేయడం వల్ల అభివృద్ధి చేసినట్టు ఎకడా కనిపించకపోయేదని.. కానీ, 2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఉపాధి హామీ పథకం ద్వారా పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, మురికి కాలువలు, సెక్రిగేషన్ షెడ్లు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, వడ్లు ఆరబోసుకునే కల్లాలు నిర్మించి ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేస్తున్నారని తెలిపారు.
వరి కల్లాలు లాంటి నిర్మాణాలు ఏ రాష్ట్రంలో లేవని, తెలంగాణలోనే ఇస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్నాదని.. కానీ కొన్ని రాష్ట్రాల్లో చేపలు ఆరబెట్టుకోవడానికి సైతం ప్లాట్ ఫామ్‌లు ఇస్తున్నారన్నారు. తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేసిన మోదీ ఈ మధ్యనే అలాంటి కుట్రను తెలంగాణపై చేయగా, ధైర్యంగా ఎదురొని పోరాడిన ధీశాలి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆలోచనలకు అనుగుణంగా అబ్ కీ బార్.. కిసాన్ సరార్ నినాదాన్ని గ్రామ గ్రామాన ప్రతి రైతు కుటుంబానికి తీసుకువెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీలాంటి బడాబాబులకు కొమ్ముకాస్తూ వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తున్నదని దుయ్యబట్టారు.
మోదీ, అమిత్‌షాలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారు..
– మదన్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే
దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షాలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. దేశంలో ఎకడా లేని విధంగా రైతు బంధు ఇస్తున్నామని, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించామని గుర్తు చేశారు. 14 ఏండ్లు పోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు బంగాళాఖాతంలోకి వెళ్లారని, అలాగే రైతులను ఇబ్బంది పెడితే మోదీకి పుట్టగతులుండవని హెచ్చరించారు.
తెలంగాణలో జరిగే సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేసేలా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. ఈడీ, ఐటీ దాడులకు భయపడేది లేదని అన్నారు. జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ, కో ఆపరేటీవ్ చైర్మన్లు అనంతరెడ్డి, హన్మంతరెడ్డి, జిల్లాలోని ఆయా మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పట్లోరి రాజు, మహేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మెదక్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఆయా గ్రామాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.