Raj Narayan | రామాయంపేట : రైతులు మోగిపురుగు బారినపడ్డ పంటలను మందులతో రక్షించుకోవాలని.. లేదంటే నీటి దడులను తగ్గించినా సరిపోతుందని రామాయంపేట వ్యవసాయశాఖ డివిజన్ అధికారి రాజ్నారాయణ అన్నారు. సోమవారం రామాయంపేట పురపాలిక పరిధిలోని గోల్పర్తి, కోమటిపల్లి, మండలంలోని వివిధ గ్రామాల్లో వరి పంటల వద్దకు వెళ్లి రైతులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు.
రైతులు వరి పంటలకు మోగి పురుగు పడితే నీటి తడులను తగ్గించడమే కాకుండా.. నివారణకు మందులు పిచికారీ చేయాలన్నారు. పంట భూమిలో ఎక్కువగా నీటి తడులు ఉండవద్దన్నారు. నీటి తడులను తగ్గిస్తే మోగి పురుగు పంట దరికి చేరదన్నారు. పంటలకు పురుగు తాకిడి రావడంతోనే వ్యవసాయ శాఖ అధికారిని రైతులు కలువాలన్నారు. వ్యవసాయశాఖ సూచనలు పాటిస్తే రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. కార్యక్రమంలో ఏఈవో సాయికృష్ణ, ప్రవీణ్ ఆయా గ్రామాల రైతులు ఉన్నారు.