గుమ్మడిదల, మార్చి 6: ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్‌యార్డు పనులు వెంటనే ఆపాలని రైతు జేఏసీ నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 30వ రోజుకు చేరుకున్నాయి. గుమ్మిడిదల, నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాల్లో గురువారం రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. గుమ్మడిదల బల్దియాలో వీరభద్ర హమాలీ సంఘం సభ్యులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు మూడు చింతల నరేందర్‌రెడ్డి, పుట్ట నర్సింగ్‌రావు మాట్లాడుతూ.. 30 రోజులుగా డంపింగ్‌యార్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడం అన్యాయం అన్నారు.
ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. డంపింగ్‌యార్డు ఏర్పాటుతో ప్రజలకు, రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని కోరారు. నల్లవల్లిలో రైతు మహిళా సంఘం సభ్యులు మాట్లాడారు. 30 రోజులుగా చేస్తున్న దీక్షలకు సర్కారు స్పందించి డంపుయార్డు పనులు వెంటనే ఆపాలన్నారు. దీక్షలో జేఏసీ నాయకులు ప్రతాప్‌రెడ్డి, మంద బలరాంరెడ్డి, మంద భాస్కర్‌రెడ్డి, ముద్దంగుల గోపాల్, రామకృష్ణ, కొరివి సురేశ్, రాజుగౌడ్, కొత్తపల్లి మల్లేశ్‌గౌడ్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.