నిజాంపేట,సెప్టెంబర్ 12 : నిజాంపేటలో రైతులు యూరియా కోసం రోడ్డెక్కి నిరసనకు దిగారు. రైతులకు సరిపడినంత యూరియా సరఫరా చేయడం లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై దుమ్మెత్తి పోశారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్.. డౌన్…మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు డౌన్..డౌన్….అంటూ నిరసన తెలిపారు.
సంఘటన స్థలానికి నిజాంపేట ఎస్సై రాజేష్ రైతులను శాంతింప చేశారు. ఉదయం నుంచి లైన్ లో నిలుచున్న యూరియా అందలేదని రైతులు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.