మెదక్, ఆగస్టు 19 (నమస్తేతెలంగాణ): అర్హతలున్నా రూ.2 లక్షల రుణమాఫీ కా లేదని మెదక్ మండలం గుట్టకిందిపల్లి గ్రామ రైతులు ఆవేదన చెందుతున్నారు. గ్రామ రైతులు సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్‌రాజ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తమకు అన్ని అర్హతలున్నా రుణమాఫీ వర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేష న్ కార్డులో పేరు లేదని రుణమాఫీ వర్తించలేదని రైతు నిమ్మల శేఖయ్య ఆరోపించారు.
అన్ని అర్హతలున్నా తనకు రుణమా ఫీ రాలేదని, తాను రూ.48,230 లోన్ తీసుకున్నానని, అయినా మాఫీ కాలేదని రైతు పిట్ల రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా పలువురు రైతులు రూ.2 లక్షల వర కు రుణాలు తీసుకున్నామని, తమకు అన్ని అర్హతలున్నా మాఫీ ఎందుకు వర్తించలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మూ డో విడతలోనైనా తమ పేర్లు జాబితాలో ఉంటాయని అనుకుంటే రాలేదని పేర్కొన్నారు. ఈ విషయమై వ్యవసాయ అధికారులు, బ్యాంకుల చుట్ట్టూ తిరిగినా లా భం లేకుండా పోయిందన్నారు. ప్రతిరోజూ బ్యాంక్ వద్దకు వచ్చి పడిగాపులు కాస్తున్నామని, అయినా ఎవరూ సమాధానం చెప్పడం లేదన్నారు.
వ్యవసాయ అధికారులు సమాధానం చెప్పడంలో నిర్ల క్ష్యం వహిస్తున్నారని, తమను చీదరించుకుంటున్నారని వాపోయారు. మెదక్ మం డలంలో వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండడం లేదని, తమ బాధ ఎవరికీ చెప్పుకోవాలో తెలియక ప్రజావాణిలో చెప్పుకోవడానికి వచ్చామ ని కలెక్టర్‌తో గుట్టకిందపల్లి గ్రామ రైతులు మొరపెట్టకున్నారు. రూ.2 లక్షల రుణమా ఫీ గ్రామానికి చెందిన 40 మంది రైతులకు వర్తించలేదన్నారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు.