కొమురవెల్లి, మార్చి 9: కాంగ్రెస్ పాలనలో రైతులకు నీళ్ల కష్టాలు మొదలయ్యాయి. కొమురవెల్లికి చెందిన రైతు సార్ల నర్సింహులు యాసంగిలో ఎనిమిది ఎకరాల్లో వరి పంట వేశాడు. కొన్ని రోజులుగా నాలుగు బోర్ల నుంచి నీళ్లు తక్కువగా వస్తుండడంతో వరి పం టకు పూర్తిగా నీళ్లు అందడం లేదు.
తపాస్పల్లి రిజర్వాయర్ ద్వారా కాలువల్లోకి నీళ్లు వదులుతారని చూసిన రైతు నర్సింహులుకు నిరాశ మిగిలింది. చేసిదేమి లేక వేసిన పంటలో సగమైన కాపాడుకుందామని పొట్ట దశకు వచ్చిన 8 ఎకరాల వరిలో 4 ఎకరాలు వరి పంటను కోసి పశువులకు మేత వేశాడు. ఈ సందర్భంగా రైతు నర్సింహులు మాట్లాడుతూ.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒక్క గుంట ఎండలేదని, గిప్పుడు 4 ఎకరాల పంట పశువులకు మేతగా వేశానని, రూ.1.20 లక్షల నష్టం వాటిల్లిందన్నారు.