సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 28: బలవంతపు భూసేకరణ వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా చేపట్టా రు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు హాజరై మాట్లాడారు. పటాన్చెరు మండలం పెద్దకంజర్లలో సర్వే నెంబర్ 120, 121, 125లో రైతుల నుంచి ప్రభుత్వం సేకరిస్తున్న బలవంతపు భూసేకరణను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు.
2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలన్నారు. భూములు కోల్పోయిన ప్రతి రైతుకు 300 గజాల ఇండ్ల స్థలం ఇవ్వాలన్నారు. హెచ్ఎండీఏ అధికారులు రైతులకు పరిహారం చెల్లించకుండా భూసేకరణ చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. గ్రామంలో సభ నిర్వహించకుండా, నోటీసులు ఇవ్వకుండా భూములను తీసుకోవడం అన్యాయమని మండిపడ్డారు. కార్యక్రమంలో సీపీఎం ఏరియా కమిటీ కార్యదర్శి నాగేశ్వరరావు, వ్యకాస కార్యదర్శి నర్సింహు లు, మాజీ ఎంపీటీసీలు జంగయ్య, ముత్యా లు, నాగభూషణం, రైతులు పాల్గొన్నారు.