సిద్దిపేట అర్బన్/నంగునూరు, సెప్టెంబర్ 27: దసరా పండుగలోపు రైతులందరికీ పంటరుణమాఫీ చేయాలని, లేదంటే సచివాలయం ముట్టడిస్తామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డెడ్‌లైన్ విధించారు. రైతు పంటరుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలకేంద్రంలో రైతులు నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ మేరకు ధర్నాకు హాజరైన పలువురు రైతులతో ఆయన ముచ్చటించారు. రుణం ఎంత ఉంది..? ఎన్ని ఎకరాల భూమి ఉంది..? రుణమాఫీ కాకపోవడానికి అధికారులు ఏం చెబుతున్నారు..? వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ఉన్నపుడు రైతులు ఏ విధంగా ఉన్నారు.. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉందో అందరికీ అర్థమైందన్నారు.
కేసీఆర్ రాకముందు ఎరువు బస్తా కావాలంటే ఉదయం ఐదు గం టలకు చెప్పులు లైన్లో పెడితే ఒక్క ఎరువు బస్తా దొరికేదన్నారు. ఎరువు బస్తాల కోసం రైతులను కాంగ్రెస్ లైన్లో నిలబెట్టిందని, కానీ కేసీఆర్ ప్రతి గ్రామానికి ఎరువుల లారీ లు పంపించి రైతులకు అందించారన్నారు. కేసీఆర్ రాకముందు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఉండేవని కేసీఆర్ వచ్చిన తర్వాత నాణ్యమైన 24 గంటల కరెం ట్ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పాలనలో దొంగరాత్రి కరెంట్ వస్తే.. కేసీఆర్ 24 గంటల కరెం ట్ ఇచ్చాడన్నారు. నాటి సీఎం కేసీఆర్ రైతులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కరో నా సమయంలో కూడా రైతులకు రైతుబంధు వేసిన ఘనత నాటి సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.
మరి నేడు పంట కోతకు వస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఎం దుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొని మూడు రోజుల్లో రైతులకు డబ్బులు అందించారన్నారు. మన దగ్గర కేసీఆర్ రాకముందు ఎకరానికి రూ.5 లక్షలు ఉంటే.. కేసీఆర్ వచ్చిన తర్వాత అన్ని రకాల సౌకర్యాలు కల్పించారన్నారు. రైతు విలువతో పాటు భూమి విలువ కూడా పెరిగిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతు విలువ తగ్గించిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాతనే రైతులకు రెండు పంటలు పండుతున్నాయని గుర్తుచేశారు. ఎరువులకు, పంట పెట్టుబడికి బాధ లేదని, పండిన పంటను కొనేందుకు కూడా ఇబ్బంది లేకుండా కేసీఆర్ చేశారన్నారు.
అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి నేడు సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడని మండిపడ్డారు. ప్రతి రైతుకూ పంటరుణమాఫీ చేయడంతో పాటు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని చెప్పానని, తన ఎమ్మెల్యే పదవి కంటే రైతుల రుణమాఫీయే తనకు ముఖ్యమన్నారు. నంగునూరు మండలంలో 11 వేల మంది రైతులు పంటరుణం తీసుకుంటే, కేవలం 5 వేల మందికి మాత్రమే మాఫీ జరిగిందన్నారు.
ఇప్పటికైనా రైతులను, ప్రజలను మోసం చేయకుండా కాంగ్రెస్ అ సెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ధర్నాలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, బీఆర్ఎస్ మండ లాధ్యక్షుడు లింగంగౌడ్, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు వేముల వెంకట్‌రెడ్డి, దువ్వల మల్లయ్య, ఎడ్ల సోంరెడ్డి, రాగు ల సారయ్య, కోల రమేశ్, మహిపాల్‌రెడ్డి, కిష్టారెడ్డి, వేణు, రవి, శ్రీకాంత్‌యాదవ్, నిమ్మ శ్రీనివాస్‌రెడ్డి, కమాల్ షరీఫ్‌తో పాటు వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
నంగునూరు యూనియన్ బ్యాంకులో లక్ష రుణం ఉంది. బ్యాంకుకు వెళ్లా. వ్యవసాయ అధికారులను అడిగితే పైనుంచే రాలేదు.. మా చేతిలో ఏంలేదు అంటున్నరు. నాకు రెండు ఎకరాల భూమి ఉంది. ఎకరం వరిసాగుచేశా, మరో ఎకరంలో కంది సాగుచేశా. వరి కోతకు వచ్చినా ఇప్పుడు రైతుబంధు పైసలు కూడా రాలే. కేసీఆర్ సార్ ఉండగా పంటకు..పంటకు బరాబార్ రైతు బంధు పడ్డది.
– మమత, మహిళా రైతు, గట్లమల్యాల, సిద్దిపేట జిల్లా
నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. నంగునూరు ఏపీజీవీబీలో రూ.80 వేల రుణం ఉంది. అయినా నాకు పంట రుణమాఫీ కాలే. బ్యాంకు అధికారులను అడిగితే ఇంకా రాలే అంటుర్రు. మొత్తం నాలుగు ఎకరాలు దొడ్డు రకం వడ్లు సాగు చేశా. ఇంతవరకు రైతు బంధు రాలే. ప్రభుత్వం అన్ని చెప్పింది.. కానీ ఇప్పుడు ఏం చేస్తలేదు.
– మాధవరెడ్డి, రైతు, కొండంరాజుపల్లి, సిద్దిపేట జిల్లా