సిద్దిపేట కలెక్టరేట్, సెప్టెంబర్ 23: పంట రుణమాఫీ చేయాలంటూ సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన 80 మంది రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. రెండు లక్షల పంట రుణమాఫీ చేస్తామని చెప్పి లక్షలోపు ఉన్న రైతులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని రైతులు ఆవేద న వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా పంట రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశా రు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్న రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. అనంతరం సిద్దిపేట కలెక్టరేట్లో వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కలెక్టరేట్ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. అనంతరం డీఆర్డీవో జయదేవ్ ఆర్యకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిద్దిపేట రూరల్ మండల బీఆర్ఎస్ నాయకులు ఎర్ర యాదయ్య, కిషన్రెడ్డి, బండి శ్రీకాంత్, హర్షవర్ధన్, రైతులు పాల్గొన్నారు.