జిన్నారం, అక్టోబర్ 21: ఎకరాకు ఆరు వందల గజాల స్థలం నష్టపరిహారంగా ఇస్తామని రైతులను ఒప్పించి భూములు తీసుకున్న అధికారులు హెచ్ఎండీఏకు అప్పగించి రెం డేండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు న్యాయం జరగలేదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం ఎకరాకు ఆరు వందల గజాల స్థలం ఇవ్వకపోతే తీసుకున్న భూములు తిరిగి రైతులకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా జిన్నారం తహసీల్దార్ కార్యాల యం ఎదుట జిన్నారం, జంగంపేట గ్రామా ల రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు.
బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, మాజీ జడ్పీటీసీ కొలను బాల్‌రెడ్డి, వెంకటేశంగౌడ్, గోవర్ధన్‌రెడ్డి, రెండు గ్రామాల నా యకులు, రైతులతో కలిసి దాదాపు గంటపా టు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూములు తీసుకున్న సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జిన్నారంలోని సర్వేనంబర్ 1001, జంగంపేటలోని సర్వేనంబర్ 376లోని భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం రెండేండ్ల క్రితం తీసుకొని హెచ్ఎండీఏకు కేటాయించి ఫెన్సింగ్ వేశారని, ఇప్పటివరకు రైతులకు ఆరు వందల గజాల స్థలం మాత్రం ఇవ్వలేదన్నారు.
భూములు తీసుకునే సమయంలోనే ఎకరాకు ఆరు వం దల గజాల స్థలం ఇస్తామని రెవెన్యూ అధికారులు హామీ ఇచ్చారని రైతులు తెలిపారు. అనంతరం తహసీల్దార్ భిక్షపతికి వినతిప త్రం అందజేశారు. సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ చెప్పారు. శ్రీనివాస్‌గౌడ్, మోహన్, బ్రహ్మేందర్గౌడ్, నరి్ంసగ్రావు, శ్రీధర్‌గౌడ్, శ్రీకాంత్‌గౌడ్, రమేశ్, రాజ్‌కుమార్, అనిల్, నిఖిల్‌గౌడ్, విట్టల్, దుర్గయ్య, పెంటయ్య, భాస్క ర్, రాములు, సత్తయ్య, నర్సింహులు, రమే శ్, నీలమ్మ, బాలమ్మ పాల్గొన్నారు.