నంగునూరు, జనవరి 25 : విద్యుత్ షాక్‌తో రైతు మృతిచెందిన ఘటన సిద్దిపేట జల్లా నంగునూరు మండలం నర్మెటలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం.. నర్మెటకు చెందిన పొన్నాల (జామచెట్టు) శ్రీనివాస్‌రెడ్డి తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా, బోరుమోటర్ నడవడం లేదని గుర్తించాడు. విద్యుత్ సరఫరాల అంతరాయం ఏర్పడిందని గమనించి సమీపంలోని 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి ఆన్ ఆఫ్ హ్యాండిల్ పట్టుకొని బంద్ చేసే క్రమం లో విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు.
ట్రాన్స్ఫార్మర్ వద్ద ఇన్సులేటర్ వైరు (జంపర్) తెగి ఆన్ ఆఫ్ చేసే హ్యాండిల్ రాడ్డుకు తాకడంతో కరెంట్ షాక్‌కు గురై అక్కడే మృతిచెందాడు. తరుచూ ఈ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని పలుసార్లు బాధిత రైతు ట్రాన్స్‌కో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట జీజీహెచ్‌కు తరలించారు. రైతు శ్రీనివాస్ రెడ్డి భార్య అరుణ ఫిర్యాదు మేరకు రాజగోపాలపేట ఎస్సై వివేక్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.