పాపన్నపేట, జూన్ 9: ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్ వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మల్లేశం (38) ఓ వ్యక్తి వద్ద భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. గత ఏడాది కురిసిన వడగండ్లకు పంట దెబ్బతిని నష్టం జరిగింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు అధికమయ్యాయి. ఈ క్రమంలో గతనెల 30న కౌలుకు తీసుకున్న భూమి వద్దకు వెళ్లి అక్కడ పురుగుల మందు తాగాడు. భార్య గమనించి అతడిని మెదక్ జిల్లా దవాఖానకు తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స చేయించి అనంతరం హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానకు తరలించారు. చికిత్స పొందు తూ అదివారం మృతిచెందాడు. భార్య యాదమ్మ ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.