కొమురవెల్లి, ఆగస్టు 4: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేట గ్రామానికి చెందిన బం డారి కనకయ్య(49) శనివారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం.. బం డారి కనకయ్య బతుకుదెరువు కోసం 30ఏండ్ల క్రి తం హైదరాబాద్‌కు వెళ్లి స్క్రాబ్ దుకాణం పెట్టుకున్నాడు.
బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులు, కాలువల నిర్మాణం చేపట్టడంతో సాగునీటి వసతి ఏర్ప డి గ్రామంలో తనకున్న మూడెకరాల్లో గ్రామానికి చెందిన వ్యక్తి సాయంతో పంట సాగు చేస్తూ హైదరాబాద్ నుంచి వచ్చిపోయేవాడు. ఆయన కొన్నేం డ్ల క్రితం పక్షవాతం బారినపడ్డాడు. బీపీ, షుగర్ సమస్యలతో బాధపడుతున్నాడు.
ఇటీవల ప్రభు త్వం రుణమాఫీ చేసిందని ఆయన ఫోన్‌కు మెసేజ్ రావడంతో గ్రామానికి వచ్చాడు. ఆరోగ్యం సహకరించడం లేదని కలత చెంది శనివారం సాయం త్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకు న్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లో ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొం దుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృ తుడి కుమారుడు కమల్‌హాసన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొమురవెల్లి ఎస్సై రాజుగౌడ్ తెలిపాడు.