ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు
మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. 22 రోజులుగా జిల్లాలో 1,25,288 మందికి కంటి పరీక్షలు చేశారు.
- 22వ రోజు కంటి వెలుగు కార్యక్రమానికి తరలివచ్చిన ప్రజలు
- మందులు, ఐ డ్రాప్స్ ఇచ్చిన వైద్యులు
- మెదక్ జిల్లాలో 6317 మందికి పరీక్షలు
- 601 మందికి కంటి అద్దాలు అందజేత
- సంగారెడ్డి జిల్లాలో 17,491 మందికి టెస్ట్‌లు
- 1246 మందికి కళ్లద్దాలు అందజేత
- శస్త్ర చికిత్సలు అవసరమైన వారిని దవాఖానలకు రెఫర్
మెదక్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. 22 రోజులుగా జిల్లాలో 1,25,288 మందికి కంటి పరీక్షలు చేశారు. 15,321 మందికి కండ్లద్దాలు అందజేశారు. మరో 13,927 మందికి అద్దాల కోసం ఆర్డర్లు ఇచ్చారు. సోమవారం జిల్లాలో 6317 మందికి కంటి పరీక్షలు చేశారు. 601 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. 563 మందికి అద్దాలకు ఆర్డర్లు ఇచ్చినట్లు మెదక్ డీఎంహెచ్‌వో డాక్టర్ చందునాయక్ తెలిపారు.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. సోమవారం జిల్లాలో 69 వైద్య శిబిరాలు నిర్వహించారు. 17,491మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 8531 మంది పురుషులు, 8960 మంది మహిళలకు ఉన్నారు. 1246 మందికి కండ్లద్దాలు అందజేశారు. 413 మంది పురుషులు, 528 మంది మహిళలకు ప్రిస్కిప్షన అద్దాలు ఆర్డర్ చేశారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో 813 మంది పురుషులు, 852 మంది మహిళలకు కండ్ల ఆపరేషన్లు అవసరమని వైద్యులు గుర్తించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

