గుమ్మడిదల, నవంబర్ 20: గుమ్మిడిదల మండలంలోని అన్నారంలో 261 సర్వేనంబర్ ప్రభుత్వభూమిలో ఎక్స్‌సర్వీస్‌మెన్, కోఆపరేటీవ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ పేరుతో ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదని విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు వెల్లడించారు. హైకోర్టు ఆదేశాలు, తహసీల్దార్ గంగాభవానీ సూచన మేరకు బుధవారం మండల రెవెన్యూ అధికారి శ్రీనివాస్‌రెడ్డి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ఐ మాట్లాడుతూ.. 25-30 ఏండ్ల క్రితం ప్రభుత్వం ఎక్స్సర్వీస్మెన్ల్లకు వ్యవసాయం చేసుకోవడానికి భూములను అందజేసిందన్నారు.
ఆ ఎక్స్సర్వీస్మెన్లు ఎక్స్‌సర్వీస్‌మెన్, కోఆప్రేటీవ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీని ఏర్పాటు చేయగా, ఆ ప్రాంతానికి ఎక్స్‌సర్వీస్‌మెన్ కాలనీగా వాడుకలోకి వచ్చిందన్నారు. ఎక్స్‌సర్వీస్‌మెన్, కోఆప్రేటీవ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ఏర్పాటు జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వ్యవసాయ కార్యకలాపాలు చేయలేదన్నారు. దీంతో ఎక్స్సర్వీస్మెన్లకు ఇచ్చిన సర్టిఫికెట్లను రద్దు చేసి వారికి కేటాయించిన భూమిని నిరుపేద ఎస్సీ కులస్తులకు అసైన్మెంట్ ద్వారా ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని తెలిపారు. ఆ సర్వేనంబర్ 261లో స్థానికంగా ఉన్న వంద కుటుంబాలు ఇండ్లు నిర్మించుకున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం కల్పించిన జీవో 58,59 ద్వారా అస్సెస్మెంట్ పట్టా సర్టిఫికెట్లు ,పంచాయతీ ద్వారా ఇంటి నంబర్లు మంజూరు జరిగినట్లు విచారణలో తెలుసుకున్నట్లు ఆర్ఐ తెలిపారు. ఈ సర్వే నంబర్భూముల్లో డంపింగ్‌యార్డు, రోడ్డు, ఈద్గా నిర్మించి ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. విచారణ నివేదిను హైకోర్టుకు నివేదించనున్నట్లు ఆర్ఐ తెలిపారు. విచారణలో జీపీ ఈవో సంగీతానాయక్, మాజీ సర్పంచ్ మురళి, నాయకులు మద్ది వీరారెడ్డి, కావలి ఐలేశ్, తుపాకుల రాజు, సంఘం శేఖర్‌గౌడ్, దర్గా భిక్షపతి, దేశబోయిన దశరథ్, ఎరుకలి కిషన్, బాలకిషన్, బోసు, నారాయణ, యేహాన్, వెంకటేశ్, పల్నాటి సత్యనారాయణ, నగేశ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.