Ex Sarpanches | నిజాంపేట, మార్చి 27 : పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని మాజీ సర్పంచుల ఆందోళన కొనసాగుతోంది. ఈ మేరకు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న మాజీ సర్పంచులను నిజాంపేట మండల మాజీ సర్పంచులను స్థానిక పోలీసులు ఇవాళ ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచులు మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఈ క్రమంలో పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న మాజీ సర్పంచులను ముందస్తు అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదన్నారు.
అక్రమ అరెస్ట్‌లకు భయపడేది లేదన్నారు. ముందస్తు అరైస్టెన వారిలో వెంకటాపూర్(కె), జడ్చెరువు తండా, నిజాంపేట గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు అనిల్‌కుమార్, అరుణ్‌కుమార్, నర్సింహులున్నారు.
TG Weather | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
KTR | అవయవ దానానికి సిద్ధం.. అసెంబ్లీ వేదికగా ప్రకటించిన కేటీఆర్
మళ్లీ రోడ్లపైకి నీటి ట్యాంకర్లు.. జోరుగా నీటి దందా..