చేర్యాల, నవంబర్ 8 : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని చుంచనకోట గుట్టలపై సంగీత శిలలు వెలుగులోకి వచ్చాయి. సంగీతం పలికే ఏనెలపై డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్‌రెడ్డి 30 రోజులుగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు.గ్రామంలో 10 అడుగుల ఎత్తు నుంచి 50 అడుగుల ఎత్తైన ఏనెలు ఉన్నాయి. చుంచనకోటలో బసాల్ట్ శిలలు భూమి అంతర్భాగం నుంచి పైకి వచ్చిన శిలాద్రవం భూమి ఉపరితలంపై చల్లబడి, ఘనీభవించినప్పుడు ఏర్పడ్డాయి.
ఈ ఏనెలపై ఉన్న శిలలను చిన్నరాయితో కొడితే గంట వలే చప్పుడు రావడం వీటి ప్రత్యేకత.క్రీస్తు పూ ర్వం 10వేల సంవత్సరాల కిందట నుంచి ఆదిమ మానవులు మొదలుకొని నేటి వరకు ఈ ప్రాంత పరిధిలోని మానవులు ఆ శిలలను మీటి మనోహరమైన సంగీతాన్ని వింటూ వస్తున్నారు.అనేక శిలలపై కొన్ని లక్షల దెబ్బలు వేస్తే ఏర్పడ్డ బద్దులు కనిపిస్తాయి.వీటి దిగువన మధ్య శిలాయుగం నాటి సూక్ష్మ రాతి పనిముట్లు, నవీన శిలాయుగం నాటి రాతిగొడ్డళ్లు, దంపుడురాళ్లు, నూరుడురాళ్లు, మృన్మయ ప్రాతలకు సంబంధించిన కుండ పెంకులు, బృహస్థ్ధాయివపు ఆధారాలు ఇక్కడ లభిస్తున్నాయి.
సిద్దిపేట జిల్లా పరిధిలోని చుంచనకోట, వీరన్నపేట, జనగామ జిల్లా పరిధిలోని వీఎస్ఆర్ నగర్,కట్కూరు పరిధిలో ఈ శిలల ఉపరితలంపై చిన్న రాయితో గీకి గీకి వేసి శిలా చిత్రలేఖనాలు(బ్రూజింగ్స్), వాటి తో పాటు శిలల ఉపరితలంపై గంటుపడేలా గీసిన శిలా చిత్రలేఖనాలను డిస్కవరీ మ్యాన్ గుర్తించారు.బ్రూజింగ్స్ చిత్రాలతో పొడవైన కొమ్ములు కల, భారతీయ జింకలు, మూపు రం,పెద్ద కొమ్ములు గల ఎద్దుల చిత్రాలు అనేకం గుర్తించారు.చుంచనకోట చెరువు గట్ట ఏనెలపై బృహత్ శిలాయుగానికి చెందిన త్రిశూలం చిత్రం చుట్టూ భాష్య రేఖలతో పట ం కట్టినట్లు ఉండటం ఒక ప్రత్యేకత అని పరిశోధకుడు తెలిపారు.
ఈ చిత్రాలతో పాటు మా నవ చిత్రాలు, సర్పిలాకార చిత్రం, గుర్రాలపై కత్తిడాలు ధరించిన ఇద్దరు వీరులు, మరో ఇద్దరు వీరులు నేలపై నిలబడి కత్తిడాలు ధరించిన యుద్ధ సన్నివేశాన్ని వెలుగులోకి వచ్చిం ది. ఈ చిత్రం ఆనాటి పశు సమాజం, సంస్కృతిని తెలియజేస్తున్నది, పశువుల అపహరణ, ఆ కాలంలో పెద్ద ఎత్తున జరిగేదని తెలుస్తున్నది.వీరగల్లు శిల్పాలకు మూలం, ఈ సంగి తం పలికే ఏనెలలో జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నుంచి సిద్దిపేట జిల్లాలోని నాగపురి, కొండపోచమ్మ మొదలుకొని జగదేవ్‌పూర్ వరకు విస్తరించి ఉన్నాయి.
ఈ శిలల పొడవున ఆదిమానవులు గీసిన చిత్రాలు ఉన్నాయి. ఈ సందర్భంగా డిస్కవరీ మ్యాన్ మాట్లాడుతూ ప్రభుత్వం వీటిని పర్యాటక ప్రాంతంగా గుర్తించడానికి అనేక అవకాశాలు ఇక్కడ ఉన్నాయని, జిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈనేలను గుర్తించడానికి పరిశోధనలు చేపట్టాలన్నారు. పదివేల ఏండ్ల కిందటి నుంచి భారతీయ జింకలు ఉన్నట్లు ఆదిమానవుల చిత్రాలు తెలుపుతుండగా నేటి కి ఆజింకల మనుగడ ఈ ఏనెలలో ఉంది. జీవ వైవిధ్యం ఉన్న ప్రాంతంగా ఈ ఏనెలను గుర్తించాలని ఆయన సూచించారు.