ACP Narsimhulu | పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి : ఏసీపీ నర్సింహులు
ACP Narsimhulu | పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ గ్రామాల్లో మొక్కలు నాటాలని గజ్వేల్ ఏసీపీ నర్సింహులు అన్నారు.
రాయపోల్ : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ గ్రామాల్లో మొక్కలు నాటాలని ( Plant saplings ) గజ్వేల్ ఏసీపీ నర్సింహులు ( ACP Narsimhulu ) అన్నారు. వనమహోత్సవంలో
భాగంగా శనివారం బేగంపేట పోలీస్ స్టేషన్ లో 60 రకాల మొక్కలను పోలీస్ సిబ్బందితో కలిసి నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత కోసం గ్రామాల్లో చెట్లను పెంచాలని సూచించారు.
మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలని దీంతో భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో యువకులు మహిళలు విద్యార్థులు ప్రజాప్రతినిధులు ప్రజలు ముందుకు వచ్చి వారి వారి ఇండ్ల ముందు మొక్కలు నాటే కార్యక్రమానికి ముందుకు రావాలని సూచించారు.
కార్యక్రమంలో తొగుట సర్కిల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ కే లతీఫ్ , గజ్వేల్ టౌన్ ఎస్సై రవి కుమార్, గజ్వేల్ టౌన్ ట్రాఫిక్ ఎస్సై సత్యనారాయణ , బేగంపేట ఎస్సై రేణుక , దౌల్తాబాద్ ఎస్సై అరుణ్ కుమార్. కుక్కునూరు పల్లి ఎస్సై బాలకృష్ణ ,తొగుట ఎస్సై నవీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

