Medak DSP | మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో శనివారం నిర్వహించిన వారాంతపు పరేడ్‌ను మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది పరేడ్‌లో పాల్గొని డ్రిల్ నిర్వహించారు. సిబ్బంది టర్నౌట్, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, ఆయుధాల నిర్వహణ విధానాన్ని డీఎస్పీ పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. విధి నిర్వహణలో సమయపాలన పాటిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. శారీరక దృఢత్వం కోసం ప్రతి రోజు వ్యాయామం, డ్రిల్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పోలీస్ శాఖ ప్రతిష్టను కాపాడే విధంగా సిబ్బంది నడుచుకోవాలని, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని తెలిపారు.