రామాయంపేట : సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తి భావం కలిగి ఉండాలని, అప్పుడే ప్రతి మనిషికి భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని రంగంపేట ఆశ్రమ పీఠాధిపతులు మాధవానంద సరస్వతి స్వామిజీ అన్నారు. శుక్రవారం రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయానికి చేరుకుని అభిషేకాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు.
అనంతరం శివాలయంలో పూజా కార్యక్రమాలను చేపట్టి శివయ్య సూక్తులను భక్తులకు వినిపించారు. శివయ్యను నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ ఆశీస్సులు ఉంటాయన్నారు. శివయ్య మామూలు దేవుడు కాదని ప్రపంచంలోని శక్తిగల మహాదేవుడు శివుడేనన్నది ఎవ్వరు కూడా మరువద్దన్నారు. ప్రతిరోజు శివనామ స్మరణ చేస్తే మనలో ఉన్న పాపాలు తొలగిపోతాయన్నారు.
ఈ కార్యక్రమంలో అర్చకులు రామ్మోహన్ శర్మ, లక్ష్మణమూర్తి గ్రామానికి చెందిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.