గజ్వేల్, జూన్ 18: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు గడిచినా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ కేసీఆర్ ప్రభుత్వంపై కాకిలెక్కలు చెబు తూ అబద్ధపు ప్రచారం చేస్తుందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీపై ఆంక్షలు విధించడం దుర్మార్గమని, ప్రతి రైతుకూ రుణమాఫీకి అవకాశం కల్పించాలన్నారు. రుణమాఫీకి రూ.35వేల కోట్లు ఖర్చవుతాయని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుతున్నదని, అంత అవసరం లేదని అవగాహన, లెక్కలు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. దీంతో ప్రజలు అయోమయంలో ఉంటున్నారని, ప్రజల కోసం మాట్లాడే వాటిపై స్పష్టత ఉండాలన్నారు. రైతులకు విత్తనాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రంలో నీట్ పేపర్ లీక్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం యూనిట్ కరెంట్‌ను రూ.3.90పైసలకు కొనుగోలు చేస్తే ప్రభుత్వం రూ.12కు కొనుగోలు చేస్తుందన్నారు. మార్పు అంటే కాం గ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి ఉందన్నారు.
కరెంట్‌పై రూ.6 వేల కోట్ల ప్రాడ్ జరిగిందని మాట్లాడమంతా తప్పేనని, ఒడిసా నుంచి కొనుగోలు చేసి తెలంగాణ తీసుకొచ్చే క్రమంలో చార్జీలు పడుతాయని నేషనల్ గ్రిడ్ అనుసంధానంలో ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఆరు నెలలుగా బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నదని ప్రతాప్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గొర్రెల పంపిణీలో రూ.700 కోట్ల స్కాం జరిగిందని మాట్లాడడంతో వాస్తవాలు లేవని, లబ్ధిదారులను అడిగితే అంత బయటపడుతుందన్నారు. దేశంలోనే రైతులకు 24గంటల కరెంట్, ఫార్మా అభివృద్ధి, వ్యవసాయం, పరిశ్రమల ఏర్పాటులో అగ్రస్థానంలో నిలిపామన్నారు. ప్రజల నడ్డి విరిచేలా రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. నాలుగు నెలల్లో రూ.40 వేల కోట్ల అప్పులు తెచ్చి ప్రభుత్వం ఏమీ చేసిందన్నారు. బీఆర్ఎస్ రూ.3.60లక్షల కోట్లతో కాళేశ్వరం నిర్మాణం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు, హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేసిందన్నారు. ఆం ధ్రలో చంద్రబాబు హామీలను అమలు చేస్తున్నరని, రేవంత్‌రెడ్డి కూడా అమలు చేయాల న్నారు. సమవేశంలో మల్లేశం, నవాజ్, కృష్ణారెడ్డి, బాలేశ్, మెట్టయ్య, శ్రీనివాస్, దుర్గాప్రసాద్, రవీందర్, ఎల్లయ్య, విరాసత్ అలీ, నర్సింగరావు, కిష్టయ్య, యాదగిరి, అజిత్, ఉమార్, నరేందర్, అహ్మద్ ఉన్నారు.