సిద్దిపేట, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణప్రతినిధి): మత్స్యకారుల అభ్యున్నతికి బీఆర్ఎస్ హయాంలో ఏటా చెరువులు,కుంటలు, రిజర్వాయర్లలో చేపపిల్లలను వదిలి ఉపాధి అవకాశాలను కల్పించింది. కొన్నేం డ్ల పాటు సబ్సిడీపై చేపి పిల్లలను నీటి వనరుల్లో వదలడంతో తెలంగాణలో నీలివిప్లవం సాకారమైంది. పల్లె లు, పట్టణాల్లో విరివిగా చేపలు లభించాయి. ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో అక్టోబర్ నెల వచ్చినా ఇంతవరకు చేప పిల్ల చెరువుకు చేరలేదు. ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యేది ఎప్పు డు..? చేప చెరువుకు చేరేది ఎప్పుడు..? చేపలు వృద్ధి చెందేది ఎప్పుడు..? యాసంగి సీజన్ ప్రారంభమైంది అంటే చెరువుల్లో నీటిశాతం తగ్గుతుంది. ఈ లోగ చేప లు వృద్ధి చెందుతాయా..? అన్న అనుమానాలు మత్స్యకారుల్లో నెలకొన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపపిల్లలను వందశాతం రాయితీతో అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా కోతలు పెట్టిందని మత్స్యకారులు చెబుతున్నారు. గతంలో పంపణీ చేసిన వారికి ఈ ప్రభు త్వం ఇంతవరకు డబ్బులు చెల్లించలేదు. ఈ ఏడాది ఇ ప్పటివరకు టెండర్ల ప్రక్రియ పూర్తికాలేదు. ఒప్పందాలు కాలేదు. ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో చేప పిల్లల పంపిణీ ఆలస్యం అవుతుండడంతో ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.బీఆర్ఎస్ హయాంలో సకాలంలో టెండర్లు పిలిచి యాసంగి రాక ముందే నీటి వనరుల్లో చేపపిల్లలను వదిలారు. ఈసారి ఆ పరిస్థితి లేదు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రెండుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలే దు. ఈసారి సిద్దిపేట జిల్లాలో 1175 చెరువుల్లో 2.21 కోట్ల చేప పిల్లలు వదలాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది బీఆర్ఎస్ హయాంలో 4.41 కోట్ల చేపపిల్లలను వదిలారు. మెదక్ జిల్లాలో ఈసారి 1654 చెరువుల్లో 2.62 కోట్ల విడుదల చేయనున్నారు. గతేడాది 5.25 కోట్ల చేపపిల్లలను వదిలారు. సంగారెడ్డి జిల్లాలో 1160 చెరువుల్లో 1.77 కోట్ల చేపపిల్లలను విడుదల చేయనున్నారు. గతేడాది 3.56 కోట్ల చేపపిల్లలను విడుదల చేశారు. మూడు జిల్లాల్లో గతేడాది కన్నా ఈసారి తక్కువ సంఖ్యలో చేపపిల్లలను వదలనున్నారు. గతేడాది ఉమ్మడి మెదక్ జిల్లాలో 13.22 కోట్లను చేపపిల్లలను వదిలితే, ఈసారి 6.60 కోట్లు మాత్రమే వదలనున్నారు. దీనికి కూడా ఇంకా సమయం పట్టనున్నది.
సిద్దిపేట జిల్లాలో 1175 చెరువులు, కుంటలు నిం డా యి. వీటితోపాటు అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లు నిండుకుండలా ఉన్నాయి. శనిగరం మధ్యతరహా ప్రాజెక్టుతోపాటు ఇత ర జలాశయాలు నిండుకుండలా ఉన్నాయి. మెదక్, సం గారెడ్డి జిల్లాల్లోనూ నీటి వనరులు కళకళలాడుతున్నాయి. సింగూరు, మంజీరా, వనదుర్గా, నల్లవాగు, హల్దీ, నారింజ ప్రాజెక్టులతోపాటు చెరువులు, కుంటలు జలాలతో నిండుగా మారాయి. ఈసారి ప్రభుత్వ విధానాలు లోపభూయిష్టంగా ఉండడంతో చేప పిల్లల టెండర్లకు కాంట్రాక్టర్లు అంతగా మొగ్గు చూపడం లేదని తెలిసింది. ఆన్లైన్ టెండర్లకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఉన్న వాటిని ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇప్పు డు టెండర్ల పూర్తి చేసి చెరువులను ఎంపిక చేసి చేప పిల్లలను పంపిణీ చేసే వరకు మరోనెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ కొద్ది సమయంలో చెరువులో చేప పిల్లలు అనుకున్న స్థాయిలో పెరిగేనా..? అన్న అనుమానాలు మత్య్సకారుల్లో నెలకొన్నాయి.