చేర్యాల, ఫిబ్రవరి 16: పాత నియోజకవర్గ కేంద్రమైన చేర్యాలను ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో శనివారం బడ్జెట్ సందర్భంగా ఆయన చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశాన్ని లేవనెత్తారు. రెండు రోజుల క్రితం చేర్యాల ప్రాంతంలో పాల రైతులు పడుతున్న కష్టాలు, వారి బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జా ప్యం తదితర అంశాలను అసెంబ్లీలో ప్ర స్తావించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. చేర్యాల ప్రాంతంలో బర్నింగ్ టాఫిక్‌గా ఉన్న రెవెన్యూ డివిజన్ అం శాన్ని అసెంబ్లీలో లేవనెత్తడంతో ఈ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు అన్ని అర్హతలు ఉ న్నాయని, డివిజన్‌కు అవసరమైన ప్ర భుత్వ కార్యాలయాల సముదాయం రెడీగా ఉన్నదన్నారు.
రెవెన్యూ, కోర్టు సమస్యలు ఉంటే సిద్దిపేటకు, పోలీస్, విద్యుత్ సమస్యలుంటే హుస్నాబాద్‌కు, వ్యవసాయం తదితర సమస్యల పరిష్కారానికి గజ్వేల్, నియోజకవర్గానికి సంబంధించి అంశాల కోసం జనగామ కు చేర్యాలటౌన్, చేర్యాల రూరల్, కొ మురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల ప్రజలు వెళ్లాల్సి వస్తున్నదన్నారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తే నాలు గు మండలాలతో పాటు చేర్యాల పట్టణ ప్రజలకు ఎంతో వసతి చేకూరుతుందన్నారు. తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్ చేసి నాలుగు మండలాల్లోని చెరువులు నింపాలని కోరారు. గతంలో ఇదే సమయంలో 105 చెరువులు నింపడంతో రైతులకు ఎంతో లాభం చేకూరిందన్నారు. ప్రస్తుతం తపాస్‌పల్లి, లద్నూరు రిజర్వాయర్లలోకి నీటిని పంపింగ్ చేసి చెరువులు నింపాలన్నారు. ఎమ్మెల్యే లేవనెత్తిన రెవెన్యూ డివిజన్ అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ చేర్యాల ప్రాంతానికి ఎంతో పేరు ఉందని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. పోరాటాలకు మారుపేరు చేర్యాలగా అభివర్ణించారు.