సంగారెడ్డి, ఏప్రిల్17: ఉద్యోగులకు రావాల్సిన వివిధ రకాల అలవెన్స్లు ప్రభుత్వం ఇవ్వకపోవడంపై ఉద్యోగులు మండిపడ్డారు. ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవోస్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పిలుపు మేరకు సంగారెడ్డి కలెక్టరేట్లో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు జావిద్అలీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సంగారెడ్డి అదన పు కలెక్టర్లు మాధురి, పాండుకు వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా జావిద్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యలపై సానుకూలంగా స్పందించి సమస్యలకు ముగింపు పలకాలన్నారు. నిరసన కార్యక్రమాలు ఉధృతం కాకుండా చూడాలని కోరారు. పెండింగ్ బిల్లులు, జీపీఎఫ్ బిల్లులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లులు, సీపీఎస్ రద్దు, ఆరోగ్య భద్రత కార్డు విషయంలో జా ప్యం, ప్రభుత్వం సకాలంలో ఇవ్వనందుకు నిరసనలు చేపట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కార్యక్రమంలో టీజీఈజేఏసీ కార్యదర్శి డాక్టర్ వైద్యనాథ్, టీఎన్జీవోస్ కేంద్ర సంఘం మహిళా ఉపాధ్యక్షురాలు నిర్మలారాజకుమారి, టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి, అసోసియేట్ ఉద్యోగులు వెంకట్రెడ్డి, క సిని శ్రీకాంత్, గెజిటెడ్ అధికారులు, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట-ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, అన్ని సంఘాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.