3 గంటలు కరెంటు చాలంటున్న కాంగ్రెస్ కావాలా.. 24గంటల కరెంటు ఇచ్చే కేసీఆర్ ప్రభుత్వం కావాలో ప్రజలు తేల్చుకోవాలని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం చిన్నశంకరంపేట, నార్సింగి మండలాల్లోని పలు గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోర్విపల్లిలో సూపర్ స్పెషలిటీ దవాఖాన కట్టిస్తానని గత ఎన్నికల్లో మైనంపల్లి ఇచ్చిన హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. అప్పుడు ప్రజలను తప్పు దోవ పట్టించి, ఇప్పుడు కొడుకు కోసం మళ్లీ అదే దారిలో ఆయన వస్తున్నాదని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
చిన్నశంకరంపేట/ చేగుంట, నవంబర్18: బీఆర్ఎస్తో 24 గంటల కరెంటు కావాలా? కాంగ్రెస్‌తో మూడు గంటల కరెంట్ కావాలా అని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి అని ప్రజలను అడిగారు. 11 సార్లు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో కొర్విపల్లిలో సూపర్ స్పెషలిటీ దవాఖాన కట్టి ఇస్తానని ప్రజలను తప్పు దోవ పట్టించిన మైనంపల్లి హన్మంత్‌రావు, ఇప్పుడు కొడుకు రోహిత్ కూడా అదే దారిలో వస్తున్నాడన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. శనివారం చిన్నశంకరంపేట మండలంలోని మిర్జాపల్లి, మిర్జాపల్లి గిరిజన తండా, కామారం, కామారం గిరిజన తండా, అంబాజిపేట, సంగాయపల్లి, టి.మాందాపూర్, టి.మాందాపూర్ గిరిజన తండా, నార్సింగి మండలంలోని శేరిపల్లి గ్రామంలో పద్మదేవేందర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామగ్రామాన బోనాలు, బతుకమ్మలు, మంగళహారతులతో పటాకులు కాలుస్తూ ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆమెపై పూల వర్షం కురిపిస్తూ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మిర్జాపల్లిలో బోనాలు, బతుకమ్మలు పోతరాజులతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటు కష్టాలు తప్పవన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుబీమా, రైతుబంధు, ఉచిత కరెంటు ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. 24 గంటలు కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్కు ఓటేస్తారో, 3 గంటల కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్‌కు ఓటేస్తారో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. సౌభాగ్యలక్ష్మీ పథకంలో అర్హులైన మహిళలకు నెలకు రూ.3వేలు, రూ.400లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ఆసరా పింఛన్‌ను రూ.2016 నుంచి రూ.5016కు పెంచనున్నట్లు తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి హన్మంతరావు మెదక్ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. గత 13 ఏండ్ల నుంచి మెదక్ ప్రజలకు దూరం ఉండి ఎన్నికల ముందు వచ్చి ఓట్లు అడిగితే ఎలా వేస్తారన్నారు. ఆడబిడ్డగా మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్జీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రశాంతంగా ఉన్న మెదక్‌లో కొట్లాటలు పెట్టే ప్రయత్నం మైనంపల్లి చేస్తున్నారన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 20 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి 5 గంటలు కూడా ఇవ్వడంలేదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవని, దీంతో పంట పొలాలు ఎండిపోయి రైతులకు నష్టం జరిగేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ధర్నాలు, రాస్తారోకోలు చేసినం, అప్పుడు మైనంపల్లి సమైక్యాంధ్ర పాట పాడారన్నారు. చిన్నశంకరంపేట, నార్సింగి మండలాల్లో నిర్వహించిన ప్రచారంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏకే గంగాధర్‌రావు, జిల్లా నాయకులు పోతరాజు రమణ, మ్యాడం బాలకృష్ణ, జడ్పీటీసీ పట్లోరి మాధవి, మండల రైతుబంధు అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్, మాజీ ఎంపీపీ కృపావతి, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు రాజు, సర్పంచ్‌లు శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మీపూలపల్లి యాదగిరియాదవ్, సాయిలు, సత్తమ్మ, భిక్షపతిగౌడ్, శారద పోచయ్య దయానంద్‌యాదవ్, గోపాల్‌నాయక్, ఎంపీటీసీలు సక్కుబాయి ప్రసాద్‌గౌడ్, శివకుమార్, వైస్ ఎంపీపీ దొబ్బల సుజాతాశంకర్, సర్పంచ్ చెప్యాల మల్లేశం, ఎంపీటీసీ బండారి సంతోషగొండ స్వామి యాదవ్, ఉప సర్పంచ్ భాగ్యలక్ష్మీ రమేశ్‌యాదవ్, మాజీ సర్పంచ్ జమాల్‌పురం రమేశ్‌యాదవ్, సింగిల్‌విండో చైర్మన్ అంజిరెడ్డి, నాయకులు కుమార్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, రమేశ్, సుధాకర్‌నాయక్, యాదగిరి,సిద్దాగౌడ్, నవీన్‌గౌడ్, లక్ష్మణ్, రమేశ్, బోయిని రమేశ్, వార్డు సభ్యులు శ్రీనివాస్, స్వామిగౌడ్, నాగరాజు, సత్యనారాయణ, కందరి శ్రీనివాస్ పాల్గొన్నారు.