Edupayala Vanadurga Matha | పాపన్నపేట, జులై 6 : ఆషాడమాసం రెండవ ఆదివారం పురస్కరించుకొని ఏడుపాయల వన దుర్గాభవాని మాతను ఫలాంబరి రూపంలో రకరకాల ఫలాలతో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక రీతిలో చూపరులను ఆకర్షించే విధంగా అలంకరించారు. ఆషాడ మాసం పురస్కరించుకుని ఏడుపాయల వనదుర్గ భవాని క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది.
సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. వీరు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో చంద్రశేఖర్, సిబ్బంది సూర్య శ్రీనివాస్, ప్రతాపరెడ్డి, శ్యాం, బ్రహ్మచారి, బత్తినిరాజు, నర్సింలు, వరుణాచారి, నరేష్, యాదగిరి, మహేష్, దీపక్, తదితరులు ఏర్పాటు చేశారు.
వేదపండితులు శంకర శర్మ, పార్థివ శర్మ ,రాము , శేఖర్ నాగరాజు తదితరులు పూజలు నిర్వహించారు. ఏడుపాయలలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తమ సిబ్బందితో ప్రత్యేక బందోబస్త్ చర్యలు చేపట్టారు.
Sigachi Industries | సిగాచి ఇండస్ట్రీస్ పేలుడు ఘటనలో 41కి చేరిన మృతులు.. ఇంకా దొరకని 9 మంది ఆచూకీ
Dalai Lama | ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు