పాపన్నపేట, ఫిబ్రవరి 24 : మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ప్రముఖ ఆలయం ఏడుపాయల దుర్గమ్మ జాతరకు ముస్తాబైంది.మహా శివరాత్రి పురస్కరించుకొని బుధవారం ప్రారంభమయ్యే జాతర మూడు రోజుల పాటు కొనసాగుతుంది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 15 లక్షల వరకు భక్తులు వస్తారు. జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర కోసం ఏటా ప్రభుత్వం నుంచి మంజూరయ్యే రూ.2 కోట్లు ఈసారి ఇంత వరకు విడుదల కాలేదు.
సింగూరు నుంచి విడుదల చేసిన 0.35 టీఎంసీల నీరు సోమవారం ఏడుపాయలకు చేరింది. మహా శివరాత్రి సందర్భంగా బుధవారం మెదటి రోజు భక్తులు మంజీరా నదిలో స్నానాలు చేసి దుర్గమ్మను దర్శించుకొని శివ దీక్షలు చేపడతారు. సాయంత్రం శివాలయంలో దీక్షలు విరమింపజేస్తారు.గురువారం జాతరలోనే ప్రధానమై ఘట్టం బండ్ల ఊరేగింపు జరుగుతుంది. శుక్రవా రం రాత్రి రథోత్సవం జరుగుతుంది. ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్ నగేశ్, ఆలయ ఈవో చంద్రశేఖర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.