Edupayala Jatara | పాపన్నపేట, మార్చి01 : ఏడుపాయల వనదుర్గ మాత జాతర సందర్భంగా 61.50 లక్షల ఆదాయం వచ్చిందని అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఈవో చంద్రశేఖర్ వెల్లడించారు. శనివారం జాతర హుండీ లెక్కింపు కార్యక్రమం రాజరాజేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో గోకుల్ షెడ్లో నిర్వహించారు.
ఇందులో బంగారం, వెండి వస్తువులు మినహా నగదు రూపంలో రూ.24.56 లక్షలు, ప్రసాద విక్రయాల ద్వారా రూ.28.71 లక్షలు, ప్రత్యేక దర్శనాల ద్వారా రూ.9.80లక్షలు, కేశఖండనం ద్వారా 68.15వేలు, ఒడిబియ్యం ద్వారా రూ.53.95 వేలు ఉన్నాయని చెప్పారు. అలాగే 16 రోజులకు గానూ హుండీని కలుపుకుని మొత్తం 61 లక్షల 50 వేల 237 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఆలయ సిబ్బంది, పోలీసుల బందోబస్తు మధ్యలో ఈ హుండీ లెక్కింపు జరిగింది.
ఏడుపాయల వనదుర్గ మాత జాతర ఆదాయం16 రోజులకు గాను6150లక్షల 237 రూపాయాలు వచ్చినట్టు ప్రత్యేక అధికారి అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ ఇఓ చంద్రశేఖర లు వెల్లడించారు. శనివారం జాతర హూండి లెక్కింపు కార్యక్రమం రాజరాజేశ్వరి సేవసమితి ఆధ్వర్యంలో గోకుల్షెడ్లో నిర్వహించారు. ఇందులో బంగార వెండి వస్తువులు మినహా నగదు రూపంలో 24.56 లక్షలు,ప్రసాద విక్రయలు ద్వారా 28 లక్షల 71 వేల 60,ప్రత్యేక దర్శనాల ద్వారా 9లక్షల 800 , కేశఖందనంద్వారా 68 వేల 150రూపాయలు,ఒడిబియ్యం ద్వారా 53 వేల 950రాగ 16 రోజుల హూండిని కలుపుకుని మొత్తం 61 లక్షల 50వేల 237 రూపాయల ఆదాయం వచ్చింది.ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది , పోలీస్లు బంధోబస్తు ఏర్పాటు చేశారు.