చిలిపిచేడు : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుల పెన్షన్ పెంచాలని మెదక్ జిల్లా చిలిపిచేడు మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు దుర్గా దాస్ అన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రూ. 4 వేల నుండి 6 వేలకు, వృద్ధులకు, బీడీ కార్మికులకు, వితంతు మహిళలకు పింఛన్లు 2 వేల నుండి 4 వేలకు పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చి తప్పవద్దన్నారు. కార్యక్రమంలో సావల జగన్ మాదిగ, లక్ష్మణ్ మాదిగ, స్వామి మాదిగ, కౌడిపల్లి మండల ఇంచార్జ్ బాలయ్య మాదిగ, ఆశనోళ్ల దుర్గా దాస్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.