హుస్నాబాద్ టౌన్, సెప్టెంబర్ 3: భారీవర్షాలతో హుస్నాబాద్ పట్టణంలోని పలు దుకాణాలు, ఇండ్లలోకి వరదనీరు రావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడటం ఆవేదన కలిగించిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులోని నిండుకుండలా మారిన ఎల్లమ్మచెరువు, మ త్తడి ప్రాంతాన్ని, వరదతో కొట్టుకుపోయిన పందిల్ల రహదారిని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భం గా మాట్లాడుతూ వర్షాలతో రైతాంగానికి భారీగా మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు వివరించారు. పట్టణానికి వరద పోటెత్తి రావడంతో దుకాణాదారులు, ఇండ్లలోకి వరద చేరి తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడం దురదృష్టకరమని, మరోసారి వరద రాకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ వరద రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
పట్టణాన్ని వరద ముంచెత్తితే తప్పకుండా ప్రజల పక్షాన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు ప్రణాళికలతో ప్రజలకు నష్టం జరగకుండా చూడాలన్నా రు. అనంతరం స్థానిక వ్యాపారస్తుడు నీరుమల్ల నాగరాజు ఇంటికి వెళ్లి పట్టణంలో వరదవల్ల జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమం లో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న, వైస్ చైర్పర్సన్ అయిలేని అనిత, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగం మధు, పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్, కౌన్సిలర్లు గోవిందు రవి, పెరుక భాగ్యారెడ్డి, బొజ్జ హరీశ్, నాయకులు వంగ వెంకట్రామ్రెడ్డి, పూదరి రవీందర్‌గౌడ్, లక్ష్మణ్‌నాయక్, వాల నవీన్, అయిలేని శంకర్‌రెడ్డి, బోజు రవి, బొల్లి శ్రీనివాస్, యాం సాని శ్రీనివాస్, రాజునాయక్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.