సిద్దిపేట, జనవరి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సం క్షేమ పథకాల్లో అర్హులైన వారందరికీ అవకాశం కల్పించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో కొత్త ఇండ్ల నిర్మాణం కోసం పేదలు పెద్ద సంఖ్య లో ఆసక్తి చూపుతున్నారని, అర్హులైన వారందరికీ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు చిన్న చిన్న పనుల మూలంగా గృహప్రవేశాలు ఆగిపోయాయని, వాటిని నిధులు మంజూ రు చేయాలన్నారు. యాసంగి నాట్లు పూర్తి అవుతున్నాయని, రైతుభరోసా రైతులందరికీ అందేలా చూడాలన్నారు. రైతు కూలీలు, కౌలు రైతులందరికీ ఇందిరమ్మ భరోసా అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను ప్రజలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలోని కాలువలు పూర్తయ్యే విధం గా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.