చేగుంట,జనవరి 12 : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడే ప్రతి మాట ప్రజలను మోసం చేసే విధంగా ఉందని నార్సింగి ఎంపీపీ చిందం సబిత, జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మైలరాం బాబు విమర్శించారు. నార్సింగిలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి చొరవతోనే బ్రిడ్జిల నిర్మాణం, రైళ్ల నిలుపుదల జరుగుతుంటే, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రెస్మీట్లో మొత్తం తానే చేస్తున్నా.. అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జప్తిశివునూర్, రెడ్డిపల్లి బ్రిడ్జిలు ఒకేసారి మంజూరు కాగా, ఆ సమయంలో ఢిల్లీ నుంచి సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లి ఒక వినతి పత్రం ఇచ్చి ఫొటో దిగి విటన్నింటినీ నేనే మంజూరు చేయించాను, రాత్రికి రాత్రే అనుమతులు తెచ్చా అని చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. అభివృద్ధి కోసం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి నిధులు మంజూరు చేయిస్తే, చివరి సమయంలో ఎమ్మెల్యే డ్రామా లు ఆడుతున్నాడని, అన్నీ తెచ్చాను అంటున్న ఎమ్మె ల్యే తూప్రాన్, మనోహరాబాద్, జెప్తిశివునూర్ బ్రిడ్జిలకు, మనోహరాబాద్-కొత్తపల్లి లైన్ కూడా మీరు చెప్తేనే వచ్చాయా, ఇవన్నీ కూడా నేనే తెచ్చా, అని ఎమ్మెల్యే ప్రచారం చేసుకు న్నా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయని దుయ్యబట్టారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ డి. సుజాత, ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేశ్, సర్పంచ్‌లు నాయక్, ఇలియాస్, తౌర్యనాయక్, శ్రీనివాస్, సిద్ధ్దగౌడ్, నరేశ్ ఉన్నారు.