దుబ్బాక, సెప్టెంబర్ 1 : ఇంటర్మీడియట్ 2022-24 విద్యా సంవత్సరంలో ఒకేషనల్ కోర్సులో రాష్ట్రస్థాయి టాపర్గా దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి దోర్నాల సుకుమార్ నిలిచాడు. ఒకేషన్ కోర్సులో సుకుమార్ ఈటీ (ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్) చేశాడు.
ఇంటర్మీడియట్లో 1000 మార్కులకు 994 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయి టాపర్గా నిలిచాడు. ఈనెల 4న హైదరాబాద్లో బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ వారు రాష్ట్ర స్థాయి టాపర్లకు నగదు పారితోషికంతో అవార్డు అందజేస్తున్నారని, ఇందులో సుకుమార్ అవార్డు అందుకుంటారని కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ తెలిపారు.