మునిపల్లి, అక్టోంబర్ 18: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మొగ్దుంపల్లిలో తాగునీటికి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలు గు రోజుల నుంచి సమస్య వేధిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మాజీ సర్పంచ్ అశోక్, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సరిపోను నీళ్లు రాకపోవడంతో నల్లాల దగ్గర గ్రామస్తులు పడిగాపులు కాస్తున్నారు.
మళ్లీ పాత రోజులు వచ్చాయని, అధికారులు స్పందించి తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని గ్రా మస్తులు కోరుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంపై మునిపల్లి ఆర్డబ్ల్యూఎస్ అధికారి అంగడ్కుమార్ను వివరణ కోరగా.. నాలుగు రోజుల క్రితం మిషన్ భగీరథ పైపులైన్ లీకేజ్ కావడంతో నీటి సరఫరా నిలిపివేశామని, రెండు రోజుల్లో సమ స్య పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.