చిలిపిచెడ్, జనవరి 19 : మెదక్ జిల్లాలో గొర్రెలు, మేకల పెంపకం దారులు గొర్రె మేకలకు అమ్మ తల్లి వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ వెంకటయ్య తెలిపారు. సోమవారం చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్ గ్రామంలో సర్పంచ్ టి రాములు తో కలిసి ఉచిత టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ.. గొర్రెల్లో షీప్ పాక్స్ వ్యాధి (అమ్మోరు లేదా బొబ్బ రోగం) లక్షణాలు తీవ్రమైనవని వైరల్ కారణంగా వ్యాపిస్తున్నాయన్నారు. సకాలంలో టీకాలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్య అధికారి డాక్టర్ వినోద్ కుమార్, ఉప సర్పంచ్ అఖిల్, గ్రామ కార్యదర్శి తిరుపతి, ఎల్. ఎస్. ఏ ఆకుల గట్టయ్య, యాదయ్య పాల్గొన్నారు.