‘నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్ చుట్టూ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి అర్హులకు అందించి వారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.’ అని సమాచార, ప్రసార శాఖల మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం కర్ధనూరు గ్రామంలో జీహెచ్ఎంసీ నిర్మించిన 540 డబుల్ బెడ్రూం ఇండ్లను శనివారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులను పూర్తి పారదర్శకంగా కంప్యూటర్ ద్వారా డ్రా తీసి ఎంపిక చేసినట్లు తెలిపారు. తాగునీరు, సీసీ రోడ్లు, సీవరేజ్ ప్లాంట్, లిఫ్టులతో పాటు అన్ని వసతులను ప్రభుత్వం కల్పించిందన్నారు. కోట్లు విలువచేసే భూముల్లో ఇండ్లు కట్టించి ఉచితంగా ఇవ్వడం గొప్ప కార్యమన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ ఉండే వారందరినీ సొంత బిడ్డల్లా చూసుకుంటామన్నారు. ఇండ్లను డబ్బులకు ఆశపడి అమ్ముకోవద్దని, కిరాయికి ఇవ్వొద్దని, ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన ఇండ్లలోనే ఉండాలని సూచించారు.
పటాన్చెరు, సెప్టెంబర్ 2: హైదరాబాద్ మహానగరంలో కిరాయి ఇండ్లలో నివసిస్తున్న నిరుపేదలకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించి వారి హృదయాల్లో స్థానం సంపాదించారు. డ్రాలో డబుల్ బెడ్రూం ఇండ్లు వచ్చిన వారంతా ఆనందంతో సీఎం కేసీఆర్‌ను కొనియాడుతున్నారని, స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులకు ఆనందంతో ధన్యవాదాలు చెబుతున్నారని సమాచార, ప్రసారశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరు మండలం కర్ధనూరు గ్రామంలో జీహెచ్ఎంసీ నిర్మించిన 540 డబుల్ బెడ్రూంలను మంత్రి మహేందర్‌రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలసి ప్రారంభించారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూంలకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఐదు వందల మందికి కంప్యూటర్ డ్రాలో ఎంపిక చేశారు. వారికీ కర్ధనూర్లోని డబుల్ బెడ్రూంఇండ్లను కేటాయించారు. రోడ్డు పక్కనే అపార్టుమెంట్లుండడంతోపాటు వాటిలో షాపింగ్ కాంప్లెక్స్, రెండు లిఫ్టులు, డ్రైనేజీ వసతి, పార్కింగ్ సౌకర్యంతో, ఎస్టీపీ, సీసీ రోడ్లు సైతం వేసి ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడారు. ప్రజలందరూ ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతున్నారని కొనియాడారు. నిరుపేదలు కూడా గౌరవప్రదంగా డబుల్ బెడ్రూం ఇండ్లల్లో ఉండాలని సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ చుట్టూ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో వేలాదిమంది సొంతింటి కల నిజమవుతున్నదని మంత్రి చెప్పారు. పూర్తిగా పారదర్శకమైన పద్ధతిలో కంప్యూటర్ ద్వారా డ్రాతీసి లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించామని చెప్పారు. నిరుపేదల ఆదాయంలో సగం ఇంటి అద్దెలకే సరిపోతున్నదని, ఇరుకిరుకు ఇండ్లల్లో సౌకర్యాలు లేకుండానే జీవిస్తున్న నిరుపేదలకు ఈ డబుల్ బెడ్రూం ఇండ్లు వరమని మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్ ప్రజాసంక్షేమం, అభివృద్ధి అంశాలకు ఇస్తున్న ప్రాధాన్యతతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిందన్నారు. నగరంలో ఇప్పుడు 12వేల మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు తొలి విడుతలో అందజేస్తున్నామని అన్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఐదువందల మందికి 26కోట్ల ఖర్చుతో నిర్మించి అందిస్తున్నామన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని కర్ధనూర్ గ్రామస్తులకు 54 ఇండ్లు ఇచ్చే ప్రతిపాదన ఉందన్నారు. చక్కటి నాణ్యతతో, అనేక వసతులను కల్పించామన్నారు. పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధి చెందినదని, ఇక్కడే డబుల్ బెడ్రూం ఇండ్లు రావడం మీ అదృష్టమన్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ తాగునీరు, సీసీ రోడ్లు, సీవేజ్ ప్లాంట్, లిఫ్టులు ఏర్పాటు చేసిందన్నారు. సూపర్ మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ భూముల ధర ఎకరా రూ.20కోట్లుందని, ఇంటి నిర్మాణం కంటే భూమి విలువ ఎక్కువ అని గుర్తించి, ఇంతటి విలువైన ప్రాంతంలో సీఎం కేసీఆర్ మీకు డబుల్ బెడ్రూంలు కట్టించి ఉచితంగా ఇవ్వడం గొప్ప కార్యక్రమమని మంత్రి కొనియాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో చేస్తున్న అభివృద్ధి అద్భుతంగా ఉందన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు, ఇతర రాష్ర్టాల ప్రముఖులు హైదరాబాద్ రోడ్లు, బ్రిడ్జిలు, అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌పై మీ అభిమానాన్ని వచ్చే ఎలక్షన్లో తప్పక చాటాలని, కేసీఆర్‌పై కృతజ్ఞతను కలిగి ఉండాలని లబ్ధిదారులకు సూచించారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ కార్పొరేటర్ అర్చనాజయప్రకాశ్, పటాన్చెరు ఎంపీపీ సుష్మాశ్రీవేణుగోపాల్రెడ్డి, జడ్పీటీసీ సుప్రజావెంకట్‌రెడ్డి, సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ గోల్కోండ నాగజ్యోతీలక్ష్మణ్, ఉపసర్పంచ్ వడ్డే కుమార్, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సొంతబిడ్డల్లా ఆదరిస్తాం
కర్ధనూర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్లు పొందిన లబ్ధిదారులను సొంత బిడ్డల్లా ఆదరిస్తాం. రాజేంద్రనగర్ నుంచి కర్ధనూర్కు వచ్చే వారికి అన్ని రకాల వసతులు కల్పిస్తాం. సంక్షేమ పథకాల్లోనూ సమాన ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పుడు మీకు వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇంటి విలువ రూ. 60నుంచి 70లక్షలు ఉంటుంది. ఉచితంగా వచ్చిందని అమ్ముకోవడం, కిరాయికి ఇవ్వడం చేయవద్దు. అలా చేస్తే వారి ఇంటిని స్వాధీనం చేసుకుంటాం. ఎక్కడా మీకు రూపాయి ఖర్చు లేకుండా చూశాం. పట్టా సర్టిఫికెట్ ఇప్పిస్తున్నాం. కర్ధనూర్‌లో భూసేకరణ చేసినప్పుడు కట్టే ఇండ్లల్లో 10శాతం గ్రామస్తులకు కేటాయించాలని అప్పటి కలెక్టర్‌ను కోరాం. ఇప్పుడు 54 డబుల్ బెడ్రూం ఇండ్లు గ్రామస్తులకు ఇవ్వాలి. ఇక్కడ కరెంటు సౌకర్యంతో పాటు రోడ్లు, మార్కెట్ వసతి, డ్రైనేజీలు ఏర్పాటు చేశాం. ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది. ఓఆర్ఆర్కు అతి దగ్గరగా ఉండడంతో మీరు ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం ఉంది.
-గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే, పటాన్చెరు
పేదలకు వరం డబుల్బెడ్రూం ఇండ్లు
సీఎం కేసీఆర్ నిరుపేదల పాలిట దేవుడు. ఇప్పుడు భార్యాభర్త పనిచేస్తే వారిలో భర్త ఆదాయం ఇంటి కిరాయికే సరిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో నిరుపేదలు పిల్లలను చదివించేందుకు రెట్టింపు కష్టపడాల్సిన దుస్థితి ఉంది. సీఎం కేసీఆర్ ముందుచూపు కారణంగా ఇప్పుడు డబుల్బెడ్రూం ఇండ్లు ఉచితంగా అందజేస్తున్నారు. ఇంటి కిరాయి మిగిలిపోతుంది. మీ పిల్లలను బాగా చదివించుకోవచ్చు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. అన్ని రాష్ర్టాల వారిని సమానంగా చూస్తున్నాం. సంక్షేమ పథకాలను సైతం అందరికీ ఇస్తున్నాం. డబుల్ బెడ్రూంల కేటాయింపులోనూ పారదర్శకతను పాటిస్తున్నాం. వచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్లను అమ్ముకోవద్దు. కిరాయికి ఇవ్వొద్దు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అద్భుతమైన సౌకర్యాలు కల్పించారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే పేదల మేలు కోరే పార్టీ. ఓట్ల కంటే మీ సంక్షేమమే మాకు ముఖ్యం. ఇతర రాష్ర్టాల వారు మేము చూసిన గొప్ప రాష్ట్రం తెలంగాణ అని, గొప్ప నేత సీఎం కేసీఆర్ అని కొనియాడుతున్నారు. ముస్లిం సోదరీమణులు అల్లా కేసీఆర్ సాబ్‌కే లియే దువా కర్తే అంటూ ఆశీర్వదిస్తున్నారు. – ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్యే, రాజేంద్రనగర్
మమ్మల్ని ఆదుకున్న దేవుడు కేసీఆర్ సార్
నా భర్త కూలి పని చేస్తాడు. నాకు ఇద్దరు పిల్లలు. చదువుతున్నారు. మా ఆయన సంపాదనతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. నెలకాగానే రూ.5వేలు ఇంటి కిరాయి కట్టాలి. చిన్నపాటి రెండు రూముల్లో ఉంటున్నాం. సీఎం కేసీఆర్ సార్రు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టి మాకు మేలు చేసిండ్రు. అధికారులు ఫోన్ చేసి మీకు డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చిందని చెప్పడంతో చాలా సంతోషం అనిపించింది. 13 ఏండ్లుగా కిరాయి ఇండ్లల్లో ఉంటున్నాం. ఇప్పుడు కిరాయి బాధ తప్పింది. కర్ధనూర్ వచ్చి ఉంటాం. మా మేలు కోరిన బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడూ అండగా ఉంటాం.
– కిష్టారాం అరుణ, లబ్ధిదారు, కాటేదాన్, రాజేంద్రనగర్
కేసీఆర్ సాబ్‌కే లియే దువా కర్తె
సీఎం కేసీఆర్ సాబ్ మాకు డబు ల్ బెడ్రూం ఇండ్లు అందజేశారు. రూపాయి ఖర్చు లేకుండానే ఇచ్చారు. సీఎం సార్ క్షేమం కోసం అల్లాను ప్రార్థి స్తాం. నా భర్త ఆర్వో ప్లాంట్‌లో పనిచేస్తారు. అద్దె ఇంట్లో కష్టంగా నివసిస్తున్నాం. సీఎం సాబ్ మాకు ఎంతో సాయం చేశారు. వారికి ధన్యవాదాలు. తెలంగాణ గవర్నమెంట్‌ను ఎప్పటికీ మర్చిపోం.
– షబానాబేగం, హసన్‌నగర్, రాజేంద్రనగర్