MLA Palla Rajeshwar Reddy | కొమురవెల్లి, జూలై 11 : జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని బీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొంగు రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేకు కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం మల్లన్న భక్తులతో పాటు బాటసారులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొంగు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ జనగామ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా కలవడానికి రావద్దని ఆ ఖర్చులతో ప్రజలకు సేవ చేయాలని సూచనతో అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అతి త్వరలో ప్రజాక్షేత్రంలో తిరుగుతారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.