Youth | నర్సాపూర్, మార్చి 27 : ప్రస్తుతం యువత సామాజిక మాధ్యమాలు, ఇతరత్రా దురలవాట్లతో కాలయాపన చేస్తూ బంగారు భవిష్యత్‌ను పాడు చేసుకుంటున్నారని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ విద్యాసాగర్ అన్నారు.
మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించబడుతున్న శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ విద్యాసాగర్ ఇవాళ సందర్శించారు. ఈ సందర్బంగా రెడ్‌క్రాస్ సొసైటీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత దురలవాట్లకు దూరంగా ఉండి శారీరక ఆరోగ్యాన్ని అభివృద్ది చేసుకొని మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే భారతదేశ అభివృద్ది సాధ్యపడుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్లడ్ బ్యాంక్ నిర్వహణ కమిటీ అడ్వైజర్ సింగం శ్రీనివాస్, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్, ప్రిన్సిపాల్ దామోదర్, ప్రోగ్రామ్ అధికారి సురేశ్‌కుమార్, అధ్యాపకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
TG Weather | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
KTR | అవయవ దానానికి సిద్ధం.. అసెంబ్లీ వేదికగా ప్రకటించిన కేటీఆర్
మళ్లీ రోడ్లపైకి నీటి ట్యాంకర్లు.. జోరుగా నీటి దందా..!