హుస్నాబాద్, ఫిబ్రవరి 21: హుస్నాబాద్ పట్టణంలో మార్చి 10న నిర్వహించే హాఫ్ మారథాన్ (21కి.మీటర్ల పరుగుపందెం)ను విజయవంతం చేయాలని సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అనురాధ కోరారు. బుధవారం సిద్దిపేట కమిషనరేట్‌లో హాఫ్ మారథాన్ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుస్నాబాద్‌లో నాల్గోసారి హాఫ్ మారథాన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్, హుస్నాబాద్ పోలీసులు సంయుక్తం గా నిర్వహిస్తున్న ఈ పోటీలు పట్టణంలోని అక్కన్నపేట రోడ్డులో జరుగుతాయన్నారు.
21కే రన్(హాఫ్ మారథాన్), 10కే రన్, 5కే రన్ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి కలిగిన రన్నర్స్ ఆన్లైన్లో పేర్లు నమో దు చేసుకోవాలన్నారు. హుస్నాబాద్‌తో పాటు ఇతర జిల్లాల యువతీయువకులు, రన్నింగ్‌లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో హుస్నాబాద్ రన్నర్స్ అ సోసియేషన్ అధ్యక్షుడు ఆకుల వెంకట్, కార్యదర్శి రమేశ్, ఉపాధ్యక్షుడు సంపత్, శ్రీనివాస్, కత్తుల బాపురెడ్డి, సీఐ సత్యనారాయణరెడ్డి, పరంధాములు, రాజు పాల్గొన్నారు.