తొగుట : ప్రమాదవశాత్తు కరెంటు షాక్ (Electric shock) తగిలి ఆరవ తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన తొగుట మండలంల తుక్కాపూర్ గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది . ఎస్సై రవికాంతారావు ( Ravikanth Rao ) తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిక్కుడు స్వామికి ఇద్దరు కుమారులు ఉండగా చిన్న కుమారుడు చిక్కుడు సాయి ప్రణీత్ (12) ఆరవ తరగతి చదువుతున్నాడు.
ఈ నెల 17 న గ్రామంలో పోచమ్మ గుడి వద్ద ఉత్సవాల్లో డెకరేషన్ లో భాగంగా విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో సాయి ప్రణీత్ అనే విద్యార్థి ఆడుకుంటూ ఆడుకుంటూ విద్యుత్ లైట్లను ఏర్పాటు చేసిన ఇనుప స్థంభాన్ని ముట్టు కోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడు తండ్రి స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.